ఈఎస్‌ఎస్ యూనిట్లు గ్రౌండింగ్ చేయాలి
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని గిరిజనులకు ఎకనామికల్ సపోర్ట్ స్కీం ద్వారా ఎంపికై న యూనిట్లను వెంటనే బ్యాంక్ అధికారులు గ్రౌండింగ్ చేయాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఆదేశించారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో బ్యాంక్ అధికారులు, మండల అభివృద్ధి అధికారులతో పీఓ మంగళవారం సమీక్షించారు. ఈఎస్‌ఎస్ 2021–22 సంవత్సరంలో అర్హులైన గిరిజనులకు యూనిట్లు ఇవ్వడంలో చేస్తున్న జాప్యంపై ఆరా తీశారు. ట్రైకార్ నుంచి నిధులు మంజూరు అయినప్పటికీ బ్యాంక్ అధికారులు లబ్ధిదారుడికి రుణాన్ని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలను సైతం బ్యాంక్ అధికారులు నిలిపివేయడం సరికాదని మండిపడ్డారు. అదే విధంగా వచ్చే గురువారం వరకు గ్రౌండ్ కాని యూనిట్లను గ్రౌండింగ్ చేయాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. గిరిజనులను, లబ్ధిదారులను ఇబ్బంది పెట్టొద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీజీవీబీ బ్యాంక్ రీజినల్ మేనేజర్ చైతన్య కుమార్, ఎస్‌బీఐ మేనేజర్ అబ్దుల్ రహీం, ఎస్‌ఓ సురేష్‌బాబు, జేడీఎం కొండల్‌రావు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా
Comments
Please login to add a commentAdd a comment