పెండింగ్ డీఏలు చెల్లించాలి
వాజేడు: పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే చెల్లించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మారావు కోరారు. ఈ మేరకు మండల కేంద్రంలో యూటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్య క్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు డీఏలను పెండింగ్‌లో పెట్టి కానుకలను ఇస్తున్నారని విమర్శించారు. తక్షణమే డీఏలను ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. జీవో నంబర్ 317 ద్వారా స్థానికతను కోల్పోయిన ఉద్యోగులను సొంత జిల్లాలకు పంపాలన్నారు. సీనియారిటీ ఆధారంగా ఉద్యోగుల విభజన చేసిన క్రమంలో జూనియర్ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు చెంచయ్య, కోశాధికారి వెంకటస్వామి, మండల అధ్యక్షుడు వాసం సుదేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment