రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు
గోవిందరావుపేట: మండలంలో రైస్ మిల్లుల్లో సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బఫర్ గోదాములలో బియ్యం నిల్వలు ప్రభుత్వం నిర్ధేశించిన ఎఫ్‌ఏ క్యూ ప్రమాణాలకు లోబడి ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా గోదాం అధికారులకు, టెక్నికల్ అసిస్టెంట్లకు పలు సూచనలు చేశారు. రైస్ మిల్లర్ల నుంచి మిల్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ కింద వచ్చిన బియ్యం నాణ్యతా ప్రమాణాలు పరిశీలించిన తర్వాతనే తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం గోవిందరావుపేట, పస్రా పరిధిలోని పలు రేషన్ షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ షాపునకు వచ్చిన రేషన్ కార్డు దారుడితో మాట్లాడుతూ రేషన్ షాపుల ద్వారా సరఫరా అవుతున్న బియ్యం నాణ్యత ఎలా ఉందని అడగగా బియ్యం బాగున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment