కొనసాగుతున్న దేవాదుల పంపింగ్
కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం గ్రామ పంచాయతీలోని గుట్టగంగారం సమీపంలోని గోదావరి వద్ద ఉన్న దేవాదుల ఎత్తిపోతల పంపింగ్ కొనసాగుతోంది. ఎత్తిపోతల వద్ద మూడు పేజ్‌లలో 10 మోటార్లు ఉండగా పేజ్‌త్రీలో ఆరు మోటార్లకు గాను మూడు మోటార్లను ఆన్‌చేసి 875క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నట్లు దేవాదుల డీఈ శరత్ తెలిపారు. గోదావరిలోకి ఎగువ ప్రాంతం నుంచి 80వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో 73,165 క్యూసెక్కుల నీటిని సమ్మక్క బ్యారేజీ 5గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నట్లు తెలిపారు.
మూడు మోటార్లతో ఎత్తిపోత
Comments
Please login to add a commentAdd a comment