కార్డులెప్పుడు?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇలా..
మొత్తం కార్డులు :
11,05,543
(ఆహారభద్రత+అంత్యోదయ+అన్నపూర్ణ)
మొత్తం యూనిట్లు (కుటుంబసభ్యులు) :
32,55,776
మండల స్థాయి స్టాక్ పాయింట్లు : 18
మొత్తం రేషన్ దుకాణాలు: 2,364
ప్రతీనెల రేషన్ బియ్యం పంపిణీ :
33,153.976 మె.టన్నులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: కొత్త రేషన్‌కార్డులతో ప‘రేషన్’ తప్పుతుందని భావించిన ఆశావహులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ౖపైలెట్ ప్రాజెక్టు కింద సర్వే చేసేందుకు ఉమ్మడి వరంగల్‌లోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక మండలంలోని ఓ గ్రామం, ఓ మున్సిపాలిటీ వార్డును ఎంపిక చేశారు. ఈ నెల 3 నుంచి 7 వరకు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో అధికారులు బృందాలుగా సర్వే పూర్తి చేశారు. ఆ తర్వాత మూడు నెలల వ్యవధిలో కొత్త కార్డులు జారీ చేసేందుకు వీలుగా అన్ని ప్రాంతాల్లో సర్వే ప్రక్రియ ముగించనున్నట్లు ప్రకటించారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే ముగించిన అధికారులు.. మిగతా గ్రామాల్లో ఎప్పటి నుంచి చేయనున్నారో ఇంకా షెడ్యూల్ ఇవ్వలేదు. దీంతో ఈ ప్రక్రియ ఎప్పుడు ముగుస్త్తుంది?డిజిటల్ రూపంలో కొత్త కార్డులు ఎ ప్పుడు అందుతాయి? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కుటుంబా ల సర్వే పూర్తి చేసి త్వరలోనే కార్డులు అందజేసే ప్ర క్రియ జరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు.
కొత్త రేషన్ కార్డులకు ఎదురుచూపులు..
ఉమ్మడి వరంగల్‌లో కొత్త కార్డుల కోసం సుమారు 72,104 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు రెండు నెలల కిందట అధికారులు ప్రకటించారు. పౌరసరఫరాల సంస్థ గణాంకాల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 11,05,543 కార్డుల ద్వారా 32,55,776 మంది కుటుంబసభ్యులు 33,153.976 మె.టన్నుల రేషన్ బియ్యం ప్రతీనెల పొందుతున్నారు. సుమారు ఐదేళ్లుగా కొత్త రేషన్‌కార్డులు జారీ చేయకపోగా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించి కూడా కొత్తగా ఎవరికీ ఇవ్వలేదు. ’ప్రజాపాలన’ కార్యక్రమంలో తెల్ల కాగితాలపై దరఖాస్తులు ఆహ్వానించినా పరిష్కరించలేదు. కొత్త రేషన్‌కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసి, సర్వేతోపాటు ఫ్యామిలీ డిజిటల్‌కార్డుల జారీకి ఆదేశాలిచ్చింది. ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం.. ఆ తర్వాత కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ జరగాలని సూచించినా ఆ ప్రక్రియ ముందుకు జరగడం లేదు.
వివరాలు తీసుకున్నరు..
ఇంకా ఏమి చెప్పలే
అధికారులు మా గ్రామంలో కూడా ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించారు. డిజిట ల్ సర్వేలో కుటుంబ సభ్యుల సంఖ్య, వివరాలను సేకరించడంతోపాటు మా గ్రూపు ఫొటో తీసుకున్నారు. కుటుంబంలో కుమారులకు పెళ్లి అయినట్ల యితే వేరుగా వివరాలను నమోదు చేశారు. ఆధార్‌కార్డుల నంబర్, పుట్టిన తేదీ వివరాలు అడిగారు. రేషన్ కార్డు ఉందా లేదా అని కనుక్కొని వెళ్లారు. ఇంకా ఏమీ చెప్పలేదు.
– కుమ్మిత లలిత, పొట్లాపూర్
ఫ్యామిలీ డిజిటల్ రేషన్‌కార్డుల కోసం ఎదురుచూపులు
పెండింగ్‌లో 72,104 దరఖాస్తులు
ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు
‘పైలెట్’ ప్రాంతాల్లో ముగిసిన సర్వే
మిగతా ప్రాంతాల్లో మొదలు కాని
వివరాల సేకరణ
ఎప్పుడు చేస్తారో కూడా
చెప్పలేని పరిస్థితి..
Comments
Please login to add a commentAdd a comment