హిమాలయ కొండగుహల్లో పరిశోధన
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ హిమాలయ కొండ గుహల్లో 3వ గొట్టు మూలంపై క్షేత్ర పరిశోధన చేస్తున్నట్లు తాడ్వాయి మండలంలోని కామారం గ్రామానికి చెందిన సమ్మక్క– సారలమ్మ ఆర్కియాలజీ, ఇండిజినస్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ కాక నర్సింగారావు, జాయింట్ డైరెక్టర్ కోటేశ్వరావు, అడిషనల్ డైరెక్టర్ తుర్రం రవితేజ, అడ్వైసర్ సోడే.శ్రీరామ్ తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ జిల్లాలోని తపకేశ్వర్‌లో సాగుతున్న పరిశోధన గురించి వారు మంగళవారం వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తపకేశ్వర్‌లో కోయల పూర్వ దేవాలయం ఉందని ఇది పూర్తిగా కొండ గుహల్లో 3వ గొట్టు మూలం ఉందని తెలిపారు. గుహలో సమ్మక్క, నాగులమ్మల విగ్రహాలు, మరో గుహలో శివలింగం దానికి ఎదురుగా నంది విగ్రహం ఉందని తెలిపారు. ఈ గుహలో మూడవ గొట్టును తెలియజేసే రాజ్యం గుర్తు త్రిభుజాకారం కలిగిన ఉందని వివరించారు. లక్ష్మీనర్సింహస్వామి దగ్గర వేల్పు దేవర లింగులు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో మూడవ గొట్టుకు సంబంధించిన కుటుంబాలు నివాసం ఉన్నట్లు పరిశోధనలతో తేలిందన్నారు. పది రోజుల పాటు హిమాలయాల్లో సింధునది ప్రాంతంలో పరిశోధన సాగుతుందని వారు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment