కాళేశ్వరాలయంలో కార్తీకశోభ
కాళేఽశ్వరం: కార్తీకమాసం సందర్భంగా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానంలో మొదటిరోజు కార్తీకశోభ నెలకొంది. శనివారం ఉదయం నుంచి త్రివేణి సంగమ గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గోదావరిమాతకు దొప్పలలో దీపాలు వదిలి మొక్కులు చెల్లించారు. సైకితలింగాలు చేసి భక్తులు ఆరాధన చేశారు. స్వామివారి గర్భగుడిలో అభిషేక, అర్చన పూజలు నిర్వహించారు. శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో మహిళలు కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఉసిరి చెట్టు వద్ద మహిళలు ప్రదక్షిణలు చేశారు. లక్షవత్తులు వెలిగించారు. దేవస్థానంలోని ప్రాకారదేవతలకు మొక్కులు చెల్లించారు. శనివారం సందర్భంగా శనిపూజలకు భక్తుల రద్దీ కనిపించింది. నవగ్రహాల వద్ద భక్తులు పూజలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment