వ్యవసాయ చట్టాలపై అవగాహన ఉండాలి
ములుగు రూరల్: రైతులు వ్యవసాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అబ్బాపూర్ గ్రామ సమీపంలోని పంట పొలాల్లో రైతులకు గురువారం న్యాయ విజ్ఙాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విత్తనాలు, పురుగు మందులు, రైతుల సాగు చట్టాల గురించి వివరించారు. కాలం చెల్లిన విత్తనాలను, పురుగు మందులను వినియోగించవద్దని సూచించారు. ఉచిత న్యాయం ఎలా పొందాలో ఎవరికి ఉచిత న్యాయం వర్తిస్తుంది అనే అంశాలపై రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాచర్ల రాజ్‌కుమార్, డీఎల్‌ఎస్‌ఏ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్
మహేందర్
Comments
Please login to add a commentAdd a comment