పీవీకి వెన్నుదన్నుగా మన్మోహన్
ఆయన మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఉమ్మడి జిల్లా ప్రజలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ సీనియర్ నేత, దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి ఉమ్మడి వరంగల్ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నిస్వార్థ రాజకీయ, ఆర్థిక వేత్తగా పేరు సంపాదించిన మన్మోహన్ సింగ్... హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కేబినెట్‌లో కీలకంగా వ్యవహరించారు. దేశ వ్యాప్తంగా ఈ రోజు అభివృద్ధి చెందుతున్న అనేక నగరాలకు బీజం వేసింది పీవీ, మన్మోహన్ సంస్కరణలే. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో రెండో నగరమైన వరంగల్ అభివృద్ధికి శ్రీకారం జరిగింది కూడా మన్మోహన్ సింగ్ హయాంలోని అని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్లతో మాట్లాడి పరిస్థితి తెలుసుకొని సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర వహించారన్న పేరుంది.
పీవీ అడుగు జాడల్లో...
పీవీ నరసింహారావు ప్రధాని కాగానే... 1991 జూన్ 21న కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌సింగ్ ఆయన కొలువులో చేరారు. పలు కీలక సంస్కరణలకు కేంద్ర బిందువు అయ్యారు. ఒక దశలో మన్మోహన్ చొరవ వల్లే మైనార్టీ ప్రభుత్వంగా ఉన్న పీవీ 1991 నుంచి 1996 వరకు పరిపాలన సాగించారంటారు.
పలువురి సంతాపం..
మన్మోహన్ సింగ్ మృతి పట్ల వరంగల్ ఎంపీ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు సంతాపం తెలిపారు. ఉద్యమ తీవ్రతను గుర్తించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో కృషి చేసిన వారిలో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో సంయమనం..
వరంగల్ పోరాటాలపై ఆరా...
ఆయన హయాంలోనే ప్రత్యేక రాష్ట్రం
Comments
Please login to add a commentAdd a comment