ఎంజీఎంలో ‘ప్రైవేట్’ దందా
ఎంజీఎం: నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకుల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. నేరుగా పేషెంట్లు చికిత్స పొందుతున్న వార్డులోకే వచ్చి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో ల్యాబ్ సౌకర్యాలు ఉండవని, రిపోర్ట్ సరిగ్గా రాదని ప్రైవేట్‌లో చేయించుకోమని పేషెంట్లకు ఆస్పత్రి వైద్య సిబ్బందే ఉచిత సలహాలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అడిగేవాడు లేక.. పట్టించుకునే వాడు కరువై ప్రైవేట్ దందా మూడు పువ్వులు ముప్పైఆరు కాయలుగా సాగుతోంది. ముడుపుల ముసుగు వేసి విచ్చలవిడిగా ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకులు దందా కొనసాగిస్తున్నారు. వీరి అక్రమ వ్యాపారానికి ఆస్పత్రి వైద్య సిబ్బందే అండగా ఉండడం గమనార్హం. దీనిపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించి సదరు ల్యాబ్ నిర్వాహకులు, వారికి సహకరిస్తున్న ఆస్పత్రి వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోగులు, వారి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment