జిల్లా అభివృద్ధికి కృషి
ములుగు: మంత్రి సీతక్క ఆదేశాలతో జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అందుకు పాత్రికేయులు సహకరించాలని కలెక్టర్ దివాకర అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీతో కలిసి గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పర్యాటకంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బిల్ట్ ఫ్యాక్టరీ తెరిపించడానికి ప్రభుత్వానికి నివేదిక అందించామని తెలిపారు. జిల్లాలో 400ఎకరాల స్థలంలో పలు రకాల పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి ముందడుగు వేశామని వివరించారు. సీఎస్‌ఆర్ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఉత్తమ బోధన చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
మంత్రి, కలెక్టర్‌ను కలిసిన టీజీఓ నాయకులు
మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు సంపత్‌రావు, ప్రధాన కార్యదర్శి జీవన్‌కుమార్‌ల ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లను అందించారు. దీంతో పాటు అదనపు కలెక్టర్ మహేందర్‌జీ కలెక్టర్‌కు పూలమొక్క అందించారు. అనంతరం నాన్‌గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలు రాజు ఆధ్వర్యంలో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ప్రకాశ్‌రెడ్డి, ఉపాధ్యక్షులు కొంరయ్య, శిరీష, విజయభాస్కర్, జితేందర్‌రెడ్డి, శైలజ, రాజు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
Comments
Please login to add a commentAdd a comment