నాణ్యతా ప్రమాణాలతో చెరువు పనులు
● రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ
మంత్రి సీతక్క
వెంకటాపురం(ఎం): మారేడు గుండ చెరువు మరమ్మతు పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మండలంలోని మారేడుగొండ చెరువు మరమ్మతు పనులకు రూ.2.86 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేయగా.. ఆదివారం మంత్రి సీతక్క శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం అకాల వర్షాలతో మారేడుగొండ చెరువు కట్ట పూర్తిగా తెగి ప్రాణనష్టంతో పాటు పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని సూచించారు. వర్షాకాలంలోపు మరమ్మతులు పూర్తిచేసి ఆయకట్టు సాగయ్యేలా అధికారులు కృషి చేయాలని.. అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ మల్లాడి రాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు గొల్లపెల్లి రాజేందర్, మిల్కూరి అయిలయ్య, బైరెడ్డి భగవాన్‌రెడ్డి, బండి శ్రీనివాస్, చెన్నోజు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment