భక్తుల కోలాహలం
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం భారీగా తరలివచ్చారు. ఫిబ్రవరి 12నుంచి 15వ తేదీ వరకు మినీ మేడారం జాతరను పురస్కరించుకొని భక్తులు ముందస్తుగా అమ్మవార్లను దర్శించుకునేందుకు మేడారానికి తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే మేడారానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీతో సమ్మక్క సారలమ్మల గద్దెల ప్రాంగణం కోలాహలంగా మారింది. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చీర సారె, నిలువెత్తు బంగారం, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మ నామస్మరణతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం మార్మోగింది. మహారాష్ట్రకు చెందిన మాజీ మంత్రి, అయ్యిరి ఎమ్మెల్యే అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారం జాతర అభివృద్ధి కోసం మహారాష్ట్ర సీఎం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తానన్నారు. అనంతరం భక్తులు వివిధ ప్రాంతాలలోని చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకున్నారు. డీఎస్పీ రవీందర్ పర్యవేక్షణలో వందల సంఖ్యలో పోలీసులు విధులు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment