రేపు సంక్రాంతి
సోమవారం శ్రీ 13 శ్రీ జనవరి శ్రీ 2025
నేడు భోగ భాగ్యాల భోగి
రైతుల పండుగ కనుమ
– 8లోu
వేదవ్యాస ఉన్నత పాఠశాలలో ముందస్తు భోగిమంటలు వేడుకలు జరుపుకుంటున్న దృశ్యం
సంక్రాంతి రోజున మహిళలు ఇంటి ఎదుట అందమైన ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలను పెడతారు. బంతి, చేమంతులతో ముగ్గులను అలంకరించి రేగు పండ్లు, ధాన్యం గింజలను గొబ్బెమ్మల వద్ద పెడతారు.. చిన్న, పెద్ద అనే తారతామ్యం లేకుండా గాలిపటాలు (పతాంగులు) ఎగురవేస్తారు. దానం, పితృతర్పణం, దేవతార్చనలు సంక్రాంతి ముఖ్య విధులుగా శాస్త్రాలు నిర్ధేశించాయి. మహిళలు పూలు, పసుపు, కుంకుమ, పండ్లు దానం చేయడం వల్ల సకల సంపదలతో పాటు చక్కని సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం. ఈ రోజు పితృదేవతారాధన చేస్తే వారి వంశాలు వర్థిల్లుతాయని పండితులు చెబుతుంటారు.
సంక్రాంతి పండుగను ప్రజలు మూడు రోజుల పాటు అంగరంగవైభవంగా జరుపుకుంటారు. ఇందులో భాగంగా సోమవారం భోగి, మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ పండుగను ప్రజలు జరుపుకోనున్నారు. సంక్రాంతి పండుగ నేటి భోగితో ప్రారంభమవుతుంది. భోగి అంటే భోగభాగ్యాలు అనుభవించే రోజుగా జరుపుకోవడం ఆనవాయితీ. పాడిపంటలు ఇళ్లకు వచ్చే సమయం కావడంతో ప్రతీ ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ ఇళ్లలో పాత వస్తువులు, దుస్తులను భోగి మంటల్లో వేస్తారు. చిక్కులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ భోగి జరుపుకుంటారు. ఇదే రోజు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు.
రైతన్నలకు అత్యంత ప్రీతిపాత్రమైనది కనుమ పండుగ. వ్యవసాయ పనులలో రైతన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ ధాన్యపు రాశులను ఇంటికి చేర్చేవరకు సహాయం చేసే బసవన్నలకు (పశువులు) పూజలు జరిపి పండుగ చేస్తారు. పశువుల కొట్టాలను కడిగి మామిడి తోరణాలు, పూల దండలతో అలంకరిస్తారు. మరికొంతమంది ఆలయాల్లో గల గోమాత కేంద్రాలను సందర్శించి పూజలు నిర్వహించి మేతను గోవులకు తినిపిస్తారు.
ములుగు/వెంకటాపురం(ఎం): జిల్లాలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. ప్రతి ఇంటా అందమైన ముగ్గులు, బొమ్మల కొలువులు.. డూడూ బసవన్నలు, హరిదాసుల రాకపోకలతో ఊరూవాడ సందడిగా మారింది. పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో చిన్నారులు గాలిపటాలు ఎగురవేస్తూ హుషారుగా గడుపుతున్నారు. పిండివంటలు చేయడంలో మహిళలు నిమగ్నమయ్యారు. సంక్రాంతిని ఆనందంగా జరుపుకునేందుకు పట్టణాలు, నగరాల్లో ఉన్న వారు స్వస్థలానికి చేరుకున్నారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment