వదలం.. కదలం
సాక్షిప్రతినిధి, వరంగల్ :
‘వడ్డించే వాడు మనోడైతే ఏ బంతిలో కూర్చున్న ఒక్కటే’ అన్నట్లుంది ఉమ్మడి వరంగల్ జిల్లా పశుసంవర్థక శాఖలో కొందరు అధికారుల పరిస్థితి. ప్రమోషన్లకు ముందు.. తర్వాత కోరుకున్న చోటే ఉండాలనుకుంటున్నారు కొందరు. ఆ కొందరి కోరిక తీర్చడం కోసం ఉన్నతాధికారులు వారు కోరుకున్న స్థానాలను పదిలంగా ఉంచి ‘డిప్యుటేషన్’ల పేరిట వారితోనే నింపేస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి జిల్లా వెటర్నరీ, పశుసంవర్థకశాఖ అధికారులుగా పదోన్నతులు కలిగిన కొందరు ఫారిన్ సర్వీసుల పేరిట డిప్యుటేషన్ పొందారు. అందులో కొందరు ఐదారు నెలల్లో పదవీ విరమణ పొందే ‘బాస్’ సీటుపై కన్నేశారని కూడా ఆ శాఖలో చర్చించుకుంటున్నారు. ఇంకొందరు ఇతర జిల్లాలకు వెళ్లినా.. తిరిగి ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో డిప్యుటేషన్‌పై చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షిస్తున్న పశుసంవర్థకశాఖలో సాగుతున్న ఈ అక్రమ డిప్యుటేషన్ల తంతు ఆ శాఖ అధికారులు, సి బ్బందిలో హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై ఫి ర్యా దు ఏకంగా ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్‌కి చేరడం చర్చనీయాంశంగా మారింది.
పైరవీలే ప్రామాణికం..
ప్రభుత్వశాఖల్లో పని చేస్తున్న ఏ స్థాయి వారికైనా బదిలీలు, పదోన్నతులు, డిప్యుటేషన్లకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. కానీ.. రాజకీయ పలుకుబడి, పైరవీల కారణంగా ఆ నిబంధనలు అపహాస్యం అవుతున్నాయి. పశుసంవర్థకశాఖ హనుమకొండ జిల్లాలో అసిస్టెంట్ డైరెక్టర్ కేడర్‌లో పనిచేసిన ఇద్దరికీ ఇటీవల సాధారణ బదిలీల్లో భాగంగా స్థానచలనం కలిగింది. పరకాల ఏరియాలోని ఏడీకి కరీంనగర్ జిల్లా హుజూ రాబాద్‌కు.. హనుమకొండ డీవీఏహెచ్‌ఓ కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న మరొకరికి భీమదేవరపల్లి మండలానికి బదిలీ అయ్యింది. ఈ బదిలీ ఉత్తర్వులు వెలువడిన సుమారు వారం రోజుల్లోనే అవసరాలు, సీనియార్టీ ప్రకారం పదోన్నతుల జాబితా వెల్లడైంది. అందులో సాధారణ బదిలీల్లో భీమదేవరపల్లికి వెళ్లిన అధికారిని కామారెడ్డి జిల్లా వెటర్నరీ, ఎనిమల్ హజ్బెండరీ అధికారి (డీవీఏహెచ్‌ఓ)గా నియమించారు. పరకాల నుంచి హుజూరాబాద్‌కు వెళ్లిన మరో అధికారికి పదోన్నతి కల్పించి డీవీఏహెచ్‌ఓగా ఆదిలాబాద్‌కు బదిలీ చేశారు. ఆయా జిల్లా కేంద్రాల్లో అవరసరాన్ని గుర్తించే అధికారులుగా వా రిని నియమించారు. ఐదారు రోజులైనా అక్కడ లే కుండా ఒకరు కరీంనగర్‌లోని ప్రోజెన్ సెమన్ బుల్ సెంటర్ (ఎఫ్‌ఎస్‌బీఎస్)కు, మరొకరు వెటర్నరీ కాలేజీ టీచింగ్ ఫ్యాకల్టీగా తిరిగి వరంగల్‌కు చేరడం ఆ శాఖ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.
బదిలీ.. పదోన్నతి.. నెలరోజులకే డిప్యుటేషన్!
పశుసంవర్థకశాఖలో బాగోతం
సీఎం చూస్తున్న శాఖలో ఇష్టారాజ్యం
డీవీఏహెచ్ఓలు, వీఏఎస్లదీ ఇదే కథ
ఫారిన్ సర్సీసుల పేరిట తిష్టకు యత్నం
డిపార్ట్మెంట్లో తీవ్ర చర్చ..
స్పెషల్ చీఫ్ సెక్రటరీ పేషీకి ఫిర్యాదులు
Comments
Please login to add a commentAdd a comment