‘పీఎం కుసుమ్’పై అవగాహన కల్పించాలి
ఏటూరునాగారం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కుసుమ్ పథకంపై గిరిజనులకు అవగాహన కల్పించాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం సాక్షిలో ప్రచురితమైన ‘కుసుమ్ దరఖాస్తులు నిల్’ కథనంపై పీఓ స్పందించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో పీఎం కుసుమ్ పథకంపై పీఓ పెసా మొబిలైజర్లు, ఇతర అధికారులతో సమీ క్షించారు. అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలకు పథకం గురించి వివరించాలన్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా 4వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడం లక్ష్యంగా ఉందన్నారు. దీనిలో భాగంగా 4 ఎకరాలు కలిగి ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా లేదా రెవెన్యూ పట్టా కలిగి, సబ్‌స్టేషన్‌కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములను 25 సంవత్సరాలకు లీజుకు తీసుకోనున్నట్లు తెలిపారు. లీజుకు తీసుకున్న భూమికి ఎకరానికి సంవత్సరానికి రూ.12,500లు చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ విధంగా నెలకొల్పిన సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను స్వయం సహాయక సంఘాల ద్వారా నిర్వహణ చేపట్టి వారిని ఆర్థికంగా ఎదిగేవిధంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు వివరించారు. ఆసక్తి కలిగిన రైతులు మరిన్ని వివరాలకు ఐటీడీఏ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈనెల 25వ తేదీలోపు రైతులను గుర్తించాలని, 27న మండలాల వారీగా మరోసారి మొబిలైజర్లతో సమావేశం నిర్వహించి దరఖాస్తులు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజ్‌కుమార్, డీటీ అనిల్, వెంకన్న, పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా
Comments
Please login to add a commentAdd a comment