పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలి
ఎస్‌ఎస్ తాడ్వాయి: మండల పరిధిలోని కాటాపూర్‌లో పేదలకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్, బీఆర్‌ఎస్ నియోకవర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె జిల్లా కేంద్రంలో కలెక్టర్ దివాకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ కాటాపూర్‌లో సర్వే నంబర్ 147లో 108 మంది నిరుపేద కుటుంబాలకు 75గజాల చొప్పున ఇంటి స్థలాలను మంజూరు చేయాలన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2023లో ఇళ్ల స్థలాలు కేటాయించినా ఇప్పటి వరకు పంపిణీ చేయలేదన్నారు. పంపిణీ చేసే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పంపిణీలో జాప్యం చోటుచేసుకుందని తెలిపారు. గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ తక్షణమే ఆ స్థలాలు పంపిణీ చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్‌రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్, మాజీ సర్పంచులు పులి నర్సయ్య, గౌరమ్మ, మాజీ ఎంపీటీసీ నర్సింగరావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగయ్య, నాయకులు హుస్సేన్, లక్ష్మీనర్సయ్య, రాంబాబు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి
Comments
Please login to add a commentAdd a comment