మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ములుగు/వెంకటాపురం(ఎం)/గోవిందరావుపేట: మహిళల ఆర్థికాభివృద్ధికి ధ్యేయంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్‌ను సోమవారం కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి ప్రారంభించారు. క్యాంటీన్‌లో చేసిన భోజనానికి మంత్రి డబ్బులు ఇచ్చి నిర్వాహకులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ఎదగడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కార్పోరేట్ కంపెనీల భాగస్వామ్యంతో 8 గ్రామాలను దత్తత తీసుకొని రూ. 2.5 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని బండారుపల్లి క్రాస్ నుంచి జీవంతరావుపల్లి క్రాస్ వరకు రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రూ. 5.11 కోట్లతో ములుగు బస్టాండ్ పనులకు, ఏటూరునాగారంలో రూ.7కోట్లతో బస్‌డిపో నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అనంతరం రోడ్డుభద్రతా మాసోత్సవంలో భాగంగా సోమవారం సాయంత్రం ములుగులోని రవాణాశాఖ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిధిగా హాజరై పలు సూచనలు చేశారు. వెంకటాపురం(ఎం) మండల కేంద్రంలో 1.20కోట్లతో నిర్మించిన పీఏసీఎస్ భవనాన్ని, రూ.8 లక్షలతో నిర్మించిన రామాంజానేయ స్వామి దేవాలయ ప్రహరీని, రూ.5లక్షలతో నిర్మించిన లక్ష్మి దేవర టెంపుల్ ప్రహరీ పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌లాల్, డీపీఓ ఓంటేరు దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. గోవిందరావుపేట మండల పరిధిలోని ఎల్బీనగర్‌లో ఓపెన్ బోర్ వెల్‌ని మంత్రి సీతక్క సోమవారం ప్రారంభించి మాట్లాడారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సింక్రోని, ఓపెన్ టెక్టస్ సంస్థల సహకారంతో నిర్మాణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మారుమూల గ్రామాలకు చెందిన 130 విద్యార్థులకు మంత్రి సైకిళ్లు పంపిణీ చేశారు. జిల్లాలో కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామాలు ఆర్థికంగా, నాగరికతకు దూరంగా ఉన్న గ్రామాలను వ్యాపార వేత్తలు, సినీ ప్రముఖులు, కార్పొరేట్ కంపెనీలు దత్తత తీసుకోవాలని కోరారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ
మంత్రి సీతక్క
Comments
Please login to add a commentAdd a comment