ఆదివాసీ చట్టాలను అమలు చేయాలని ధర్నా
ఏటూరునాగారం: భారత రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన చట్టాలను అమలు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పూనేం శ్రీనివాస్, నాయకులు ఉయిక శంకర్, ధనసరి రాజేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని వైజంక్షన్ వద్ద కొమురం భీం విగ్రహం నుంచి ఐటీడీఏ వరకు ఆదివాసీలు సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1/70 చట్టం అమలు చేయడంలో అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. నీటి సౌకర్యం లేని ఆదివాసీ భూములకు పంట బోర్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఆదివాసీ హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుర్శ కృష్ణబాబు, తాటి రాంబాబు, పాయం భారతి, లొడిగే నర్సింహరావు, కుర్సం శివశంకర్, సురేష్, గోపి, అర్జున్, చంటి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment