భూమి లేకున్నా.. గుంటన్నర ఉన్నట్లు..
నేను ఒంటరి మహిళను.. ఎలాంటి భూమి లేదు. కానీ రైతు ఆత్మీయ భరోసా పథకంలో గుంటన్నర భూమి ఉన్నట్లు వచ్చింది. దానివల్ల నాకు వచ్చే పథకం రాకుండా పోయింది. సర్వేకు వచ్చినప్పుడు భూమి లేదని చెప్పినప్పటికీ భూమి ఉన్నట్లు రాశారు. దానిని తొలగించి అర్హత కలిగిన పథకాలు వర్తింపజేయాలి.
– మహ్మద్ హసీనా,
చిన్నబోయిపల్లి, ఏటూరునాగారం
ఇందిరమ్మ ఇల్లు కావాలి..
ఇందిరమ్మ ఇళ్లు కావాలని దరఖాస్తు చేసుకున్నాను. ఇంటికి సర్వేకు వచ్చిన అధికారులు పెంకుటిల్లు ఫొటో తీసుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. కానీ ఇందిరమ్మ ఇంటి జాబితాలో నా పేరు లేదు. ఇల్లు ఉన్న వారికే ఇల్లులు వచ్చాయి. ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది.
– అప్సర్‌బీ, గృహిణి, చిన్నబోయినపల్లి
Comments
Please login to add a commentAdd a comment