ప్రణాళికతో ముందుకెళ్లాలి
ములుగు: కేసుల పరిష్కారానికి పోలీస్ అధికారులు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో బుధవారం రెండో అర్ధభాగ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారానికి కేసు అధికారులను నియమించాలన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో రాత్రిపూట, వీకెండ్లలో పహారా పెంచాలని సూచించారు. మద్యం తాగే బహిరంగ ప్రదేశాలను గుర్తించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించాలని, ప్రమాద ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైస్పీడ్ డ్రైవింగ్‌ను నియంత్రించడానికి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలన్నారు. వివాదాస్పద భూముల పరిష్కారంపై అధికారులతో సమావేశాలు నిర్వహించి, భూముల డాక్యుమెంటేషన్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. విద్యా సంస్థలు, కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సైబర్ క్రైంపై సూచనలు చేయాలని సూచించారు. ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్‌డీపీఎస్(మాదకద్రవ్యాల) సరఫరా నెట్‌వర్క్‌పై నిఘా పెంచాలని తెలిపారు. పోలీసుల పనితీరును తెలుసుకునేందుకు రాష్ట్ర పోలీస్‌శాఖ ఏర్పాటు చేసిన పబ్లిక్ ఫీడ్‌బ్యాక్ క్యూర్ కోడ్‌పై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో ఓఎస్డీ గీతే మహేశ్‌బాబా సాహెబ్, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీసీఆర్బీ, సివిల్ డీఎస్పీ కిశోర్‌కుమార్, రవీందర్, ఇన్‌స్పెక్టర్లు అజయ్, రమేశ్, శంకర్, రవీందర్, కుమార్, ఎస్సైలు వెంకటేశ్వరావు, సతీశ్, కమలాకర్, శ్రీకాంత్‌రెడ్డి, తాజుద్దీన్, సూరి, తిరుపతి, రాజ్‌కుమార్, వెంకటేశ్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ శబరీశ్
పదోన్నతితో బాధ్యత పెంపు
పోలీస్‌శాఖలో పదోన్నతి ఉత్సాహంతో పాటు బాధ్యతను పెంచుతుందని ఎస్పీ శబరీశ్ అన్నారు. ఈ మేరకు రామగుండం కమిషనరేట్ నుంచి జిల్లాకు పదోన్నతిపై వచ్చిన ఆరుగురు ఎస్సైలు, ఏఎస్సైలతో పాటు జిల్లాలో పదోన్నతి పొందిన మరొకరు బుధవారం ఎస్పీని తన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. సమర్థవంతంగా విధులు నిర్వ ర్తిస్తూ ప్రజలకు అండగా ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment