సమస్యల పరిష్కారానికి కృషి
గోవిందరావుపేట: కోయ కమ్యూనిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. మండల పరిధిలోని పస్రాలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో రూరల్ డెవలప్‌మెంట్‌ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్‌ఎస్ తాడ్వాయి మండలంలోని కోయ కమ్యూనిటీకి చెందిన 22మంది గ్రామ స్థాయి నాయకులకు బుధవారం స్వశక్తీకరణ శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్థాయి నాయకులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు, ఎంఈఓ కేశవరావు, డిప్యూటీ తహసీల్దార్ సురేష్, నిరంజన్, సరస్వతీ, సంజీవ్, సుబ్రహ్మణ్యం, నర్సింహులు, ధనలక్ష్మీ, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
Comments
Please login to add a commentAdd a comment