అసంక్రమిత వ్యాధులపై దృష్టి
ఏటూరునాగారం: అసంక్రమిత వ్యాధులను గుర్తించడంపై వైద్యులు, వైద్య సిబ్బంది దృష్టి సారించాలని జాతీయ హెల్త్ మిషన్ జిల్లా ప్రోగ్రాం అధికారి చిరంజీవి అన్నారు. మండల పరిధిలోని చిన్నబోయినపల్లి పల్లె దవాఖానాలో నేషనల్ హెల్త్ ప్రోగ్రాం, క్వాలిటీపై వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలకు బుధవారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. నేషనల్ హెల్త్‌మిషన్ ప్రోగ్రాం కింద 12రకాల సేవలను ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు. ఎన్‌సీడీ, మాతాశిశు, గర్భిణి, శిశు సంరక్షణ, కౌమారదశ, అసంక్రమిత, అంటువ్యాధులపై సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్య సదుపాయాలను ప్రజలకు క్షేత్ర స్థాయిలో చేరవేయాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఆశ కార్యకర్తలు వారి విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. అంటు వ్యాధులు, జ్వరాలు, దగ్గు, జలుబు వంటివి వెంటనే గుర్తించాలన్నారు. వారి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకొని ఆన్‌లైన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు అన్మిషా, ఏఎన్‌ఎం పుణ్యవతి, సమ్మక్క, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
జాతీయ హెల్త్ మిషన్
ప్రోగ్రాం అధికారి చిరంజీవి
Comments
Please login to add a commentAdd a comment