క్షేత్ర పర్యటనతో ప్రత్యక్ష అనుభవం
ఏటూరునాగారం: క్షేత్ర పర్యటనతోనే ప్రత్యక్ష అనుభవం ఉంటుందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రేణుక అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బీఏ, బీకాం విద్యార్థులను యువ టూరిజం క్లబ్, సోషల్ సైన్సెస్, కామర్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పర్యటనను బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో గల పురాతనమైన పాండవుల గుట్టను సందర్శించినట్లు తెలిపారు. ఈ పాండవుల గుట్ట చాలా పురాతనమైందని అక్కడి గుట్టపై పాండవులు వనవాసం చేసిన సందర్భంలో వారు నివసించిన గుహలు, రాతి పెయింటింగ్స్, ముంగిసగుట్ట, శిలాతోరణం, పాండవుల గుహలు, పోతిరాజు చెలిమే వంటివే గాక ప్రాక్ యుగము నుంచి చారిత్రక యుగం వరకు వేసిన రాతి చిత్రాలను విద్యార్థులకు చూపించి వాటి గురించి వివరించినట్లు వెల్లడించారు. అక్కడ వివిధ ఆకారాల్లో ఉన్న చెట్లు, కొండలు, ప్రకృతి సౌందర్యాన్ని చూసి అధ్యాపకులు విద్యార్థులు ఎంతగానో ఆనందించారు. ఈ కార్యక్రమంలో యువ టూరిజం క్లబ్ సమన్వయ కర్త వెంకటయ్య, అధ్యాపకులు సంపత్, రమేష్, భాస్కర్, శేఖర్, మున్ని తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రేణుక
Comments
Please login to add a commentAdd a comment