విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి అన్నారు.
– 8లోu
పంచాయతీల ఏర్పాటుతోనే గ్రామాల అభివృద్ధి
చిన్న గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడం మూలంగా గ్రామాలు మరింత అభివృద్ది చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 500జనాభా కలిగిన ప్రతీ పల్లెను పంచాయతీగా ఏర్పాటు చేసింది. పల్లెలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడం ద్వారా గ్రామంలో ప్రభుత్వ పథకాల అమలుకు ప్రత్యేక నిధులు మంజూరవుతాయి. పరిపాలన సౌలభ్యం సులభతరమై ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు జరగనుండడంతో ఆశావహులు సైతం నూతన పంచాయతీల కోసం ఎదురుచూస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందే తమ గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఎనిమిది మండలాల పరిధిలో..
జిల్లాలో 9 మండలాలు ఉండగా 8 మండలాల పరిధిలో కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ములుగు మండలంలో చిన్న గుంటూరుపల్లి, శ్రీరాములపల్లి, జగ్గన్నగూడెం, చింతకుంట, గోవిందరావుపేట మండలంలో మొద్దులగూడెం, ఎస్‌ఎస్ తాడ్వాయి మండలంలో కొండపర్తి, బిట్టుపల్లి(కొడిశాల), పడిగాపూర్, ఏటూరునాగారం మండలంలో బూటారం, గోగుపల్లి, కన్నాయిగూడెం మండలంలో చిట్యాల, భూపతిపురం, కన్నాయిగూడెం, సింగారం, మంగపేట మండలంలో తొండ్యాల లక్ష్మిపురం, నరెందర్‌రావుపేట, శనిగకుంట, జబ్బోనిగూడెం, అబ్బాయిగూడెం, వాజేడు మండలంలో అరుణాచలపురం, వెంకటాపురం(కె) మండలంలో కొత్త కొండాపురం గ్రామాలు నూతన పంచాయతీలుగా ఏర్పాటు కానున్నాయి. వెంకటాపురం(ఎం) మండలంలో కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు.
Comments
Please login to add a commentAdd a comment