52.87శాతం గ్రామసభలు పూర్తి
ములుగు/ములుగు రూరల్/ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాల అమలుకు చేపట్టిన గ్రామసభలు రెండోరోజూ పలు గ్రామ పంచాయతీల్లో కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా బుధవారం నాటికి 52.87 శాతంగా గ్రామసభలు పూర్తి అయ్యాయి. ఈ గ్రామసభల్లో వివిధ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల జాబితాను అధికారులు ప్రజలకు చదివి వినిపించారు. అనంతరం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా దరఖాస్తులను స్వీకరించారు.
జాకారం, షాపెల్లిలో నిలదీత
ములుగు మండలంలోని గుర్తూరుతండా, మల్లంపల్లి, జాకారం, పత్తిపల్లి, పెగడపల్లి, సర్వాపూర్, కొత్తూరు, జంగాలపల్లి గ్రామాలలో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాకారం పంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో మండల పంచాయతీ అధికారి రహీమొద్దీన్ ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితా చదువుతుండగా పలువురు గ్రామస్తులు తమ పేర్లు రాలేదంటూ అధికారులను దిగారు. పేర్లు రానివారు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమనిగింది. అదే విధంగా ఏటూరునాగారం మండల పరిధిలోని షాపెల్లిలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీఓ కుమార్ అర్హుల జాబితా చదువుతుండగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జాబితాలో తమ పేర్లు లేవంటూ పలువురు అధికారులు నిలదీశారు. ఈ క్రమంలో పలువురు గ్రామస్తుల మధ్య గలాట చోటుచేసుకోగా పోలీసులు కల్పించుకుని గొడవ సద్దుమనిగేలా చూశారు.
జాకారం, షాపెల్లి గ్రామసభల్లో వాగ్వాదం
Comments
Please login to add a commentAdd a comment