కాళేశ్వరం చుట్టూ రాజకీయం
గర్భగుడిలో వీడియోలకు అనుమతి లేదు..
కాళేశ్వరం దేవస్థానంలో గర్భగుడిలో కాళేశ్వరుడు(యముడు), ముక్తీశ్వరుడు (శివుడు) ఒకే పానవట్టంపై కొలువైనారు. గర్భగుడిలో ఫొటోలు, వీడియోలు తీయడానికి అనుమతి ఉండదు. కానీ యథేచ్ఛగా ఓ ప్రైవేట్ పాట చిత్రీకరణ జరగడంపై భక్తులను విస్మయానికి గురిచేసినట్లు విమర్శలు వచ్చాయి. ఆలయ ఆవరణలో ఫొటోలు, వీడియోలు తీయొద్దని సూచిక బోర్డులు సైతం అమర్చారు. నిబంధనలు తుంగలో తొక్కి పాట చిత్రీకరణ చేయడంపైన పలు పార్టీలు కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దేవస్థానం బాధ్యులపై, సింగర్ మధుప్రియ, పాట చిత్రీకరణ యూనిట్‌పై కేసులు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు చల్లా నారాయణరెడ్డి డిమాండ్ చేశారు.
కాళేశ్వరం: దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరం దేవస్థానం చుట్టూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల రాజకీయం చోటుచేసుకుంది. రెండు రోజుల కిందట కాళేశ్వరం దేవస్థానం గర్భగుడిలో ప్రముఖ సింగర్ మధుప్రియ పాట చిత్రీకరణతో రెండు పార్టీల మధ్య వైరం రాష్టవ్యాప్తంగా దుమారం లేపింది. ఈనెల 20న మధుప్రియ ప్రైవేట్ పాటను శివుడిపై తీసేందుకు తన బృందంతో కాళేశ్వరాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు చెందిన వ్యక్తులు కాళేశ్వరం దేవస్థానం ఈఓ మారుతితో ఫోన్‌లో మాట్లాడారు. కాళేశ్వరం ఆవరణ, గోదావరి తీరం వద్ద పాట చిత్రీకరణ చేస్తామని అనుమతి పొందారు. ఆయన కూడా అందుబాటులో లేనని బదులిచ్చారు. దీంతో ఆ బృందం సభ్యులు ఏకంగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి వారి గర్భగుడి ద్విలింగాల ఎదుట మధుప్రియ పాట చిత్రీకరణను రెండు నిమిషాల పాటు నృత్యం చేస్తూ వీడియో తీశారు. దీనికితోడు వారివెంట కాళేశ్వరానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు ఒకరు ఉన్నారు. గర్భగుడిలో పాట చిత్రీకరణ జరిగిన వీడియో, ఫొటోలు బయటకి రావడంతో స్థానిక కాంగ్రెస్‌పార్టీకి చెందిన నాయకులు ఫొటోలు, వీడియోలను మీడియాకు అందించడంతో వివాదం రాజుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మంత్రితో అభివృద్ధి ౖపైపెకి..
రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్ల నిధులు సరస్వతి పుష్కరాలు మంజూరు చేశారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాళేశ్వరం దేవస్థానం అభివృద్ధికోసం కృషి చేస్తూ చర్యలు చేపడుతుండగా ఆలయంలో అధికారుల బాధ్యతారాహిత్యం, ఓ వైపు రాజకీయ నాయకుల చేష్టలతో ప్రతిష్ట దెబ్బతింటుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారులు టూర్‌లో..
ఫిబ్రవరిలో మూడు రోజులపాటు నిర్వహించే కుంభాభిషేకం, మే నెల 15 నుంచి 26 వరకు జరుగు సరస్వతీ పుష్కరాలకు శృంగేరి పీఠాధిపతిని ఆహ్వానించడానికి కాళేశ్వరం దేవస్థానం ఈఓ మారుతి, సూపరింటెండెంట్ శ్రీనివాస్, అర్చకులు కర్ణాటకలోని బళ్లారికి వెళ్లారు. ఈఓతో పాటు కిందిస్థాయి సిబ్బంది ఎందుకు వెళ్లడం అని భక్తులు ఆరోపిస్తున్నారు.
నోటీస్‌తో సరి..
సింగర్ మధుప్రియ ఘటనపై ఈఓ మారుతి కాళేశ్వరం దేవస్థానంలో ఓ అర్చకునికి నోటీస్ ఇచ్చి సరిపెట్టుకున్నారు. గర్భగుడిలో పాట చిత్రీకరణ జరిగితే సమాచారం ఇవ్వనందుకు అర్చకుడికి ఈఓ నోటీస్ అందజేశారు. దీనిపై పలు సంఘాలు, బీజేపీ నాయకులు ఆందోళనలు చేపడుతున్నారు. ఈఓతో పాటు బాధ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కాళేశ్వరం దేవస్థానం ప్రతిష్ఠకు భంగం కలుగుతున్నా అధికారులు మాట్లాడడం లేదు.
అనుమతి తీసుకోలేదు..
గర్భగుడిలో పాట చిత్రీకరణకు అనుమతి లేదు. కాళేశ్వరం ఆవరణలో తీసుకోవడానికి సింగర్ మధుప్రియకు సంబంధించిన వారు ఫోన్‌లో అనుమతి తీసుకున్నారు. గర్భగుడిలో పాట తీసిన విషయంలో అర్చకుడికి సమాచారం ఇవ్వలేదని నోటీస్ అందజేశాను. ఉన్నతాధికారులకు విషయాన్ని నివేదించా.
– మారుతి, ఈఓ, కాళేశ్వరం దేవస్థానం
గర్భగుడిలో సింగర్ మధుప్రియ పాట చిత్రీకరణపై దుమారం
మౌనంవీడని
దేవాదాయశాఖ అధికారులు
రూ.25కోట్ల నిధుల మంజూరుతో
అఽధికారులు బిజీ
ఓ అర్చకుడికి నోటీస్ ఇచ్చిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment