జాతీయ స్థాయి మెంటర్‌గా రామయ్య
ములుగు రూరల్: జాతీయ స్థాయి మెంటర్‌గా మండలంలోని అబ్బాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు కందాల రామయ్య ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం భాస్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని మెయిల్ ద్వారా జాతీయ మెంటరింగ్ కన్వీనర్ డాక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారని తెలిపారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు–2022లో సాధించిన రామయ్యను జాతీయ విద్యా మండలి, జాతీయ మెంటర్ మిషన్ ఎంపిక చేయడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. రామయ్య గణిత శాస్త్ర బోధనా అధ్యయన, మనోవిజ్ఞాన శాస్త్రం, జీవ నైపుణ్యాలు, విద్య మానసిక ఆరోగ్యం, బోధన –అభ్యాసం, సాంకేతిక పరిజ్ఞానం అంశాలలో తన అనుభవాన్ని గుర్తించి జాతీయ మెంటర్‌గా ఎంపిక చేశారని వివరించారు. ఈ సందర్భంగా రామయ్యకు డీఈఓ పాణిని, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ మల్లారెడ్డి అభినందనలు తెలిపినట్లు వెల్లడించారు.
మైనార్టీ గురుకులంలో
ప్రవేశాలకు దరఖాస్తులు
ములుగు రూరల్: ములుగు మండల పరిధిలోని దేవగిరిపట్నం మైనార్టీ బాలికల గు రుకుల పాఠశాలలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థినులు దరఖాస్తులు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో 80 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అందులో మైనార్టీలకు 60 సీట్లు, ఇతరులకు 20 సీట్లు కేటాయింపు ఉంటుందని వివరించారు. ఇతరులను లక్కీడీప్ ద్వారా ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. బీసీలకు –10, ఎస్సీ–5, ఎస్టీ–3, ఓసీ–2 సీట్లు ఉంటాయని పేర్కొన్నారు. వీటితో పాటు పాఠశాలలో 6వ తరగతిలో మైనార్టీలకు సీట్లు 26, 7వ తరగతిలో 23, 8వ తరగతిలో 15సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థినులు ఫిబ్రవరి 28వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. టీఎంఆర్‌ఈఐఎస్. తెలంగాణ.జీఓవీ. ఇన్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్ 7995057915, 9398019134, 630 5229119లలో సంప్రదించాలని సూచించారు.
పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలి
ములుగు రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామసభల ద్వారా నిరుపేదలను ఎంపిక చేసి సంక్షేమ పథకాలను అందేలా చూడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జున్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు, నాయకులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్, ముత్యాల రాజు, బండి నర్సయ్య, జక్కుల అయిలయ్య, శ్యామ్, సాగర్, మణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉపన్యాస పోటీల
విజేతలకు ప్రశంసపత్రాలు
ములుగు: ఇంగ్లిష్ భాషా ఉపాధ్యాయుల అసోసియేషన్(ఎల్టా), భరత స్వచ్ఛంద సేవా ఆధ్వర్యంలో జిల్లాలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం ఆంగ్ల ఒలంపియాడ్, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, ప్రశంస పత్రాలను అందించారు. ఒలంపియాడ్ మొదటి విభాగం ఏటూరునాగారం జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి కృష్ణ, ద్వితీయ స్థానంలో వెంకటాపురం(కె) జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి శ్రీజ, తృతీయస్థానంలో రామన్నగూడెం జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి సుష్మశ్రీ, నిలిచారు. విజేతలను జిల్లా కామన్ పరీక్షల నియంత్రణ అధికారి ఇనుగాల సూర్యనారాయణ అభినందించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ చేయనున్న దేవగిరిపట్నం స్కూల్ అసిస్టెంట్ అశోక్‌ను ములుగు జిల్లా ఆంగ్ల ఉపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి, కార్యదర్శి అనిత, ఆర్గనైజింగ్ సెక్రటరీ శంకరయ్య సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment