21
మరో
పంచాయతీలు..!
వెంకటాపురం(ఎం): ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా పంచాయతీ అధికారులు 8 మండలాల పరిధిలో కొత్తగా 21పంచాయతీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో 174 గ్రామ పంచాయతీలు 1,556 వార్డులు ఉండగా కొత్తగా 20 పంచాయతీలు ఏర్పడితే జీపీల సంఖ్య 195కు చేరనుంది. జీపీలతో పాటు వార్డుల సంఖ్య కూడా పెరగనుంది.
జిల్లాలో 195కు చేరనున్న జీపీలు
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అధికారులు
8 మండలాల పరిధిలో
పెరగనున్న జీపీలు, వార్డులు
21 పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు
జిల్లాలో 21గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఆయా గ్రామాల్లో ఉన్న జనాభా, ఓటర్లు, పాత పంచాయతీలకు కొత్తగా ఏర్పడే పంచాయతీలకు మధ్య ఉన్న దూరంతో పాటు తదితర ఆంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం నూతన పంచాయతీలను ఏర్పాటు చేయనుంది. జిల్లాలో 174 జీపీలు ఉండగా అదనంగా మరో 21 ఏర్పడితే గ్రామ పంచాయతీల సంఖ్య 195కు చేరనుంది.
– ఒంటేరు దేవరాజు, డీపీఓ
Comments
Please login to add a commentAdd a comment