వేడుకలకు ముస్తాబైన సిర్సనగండ్ల | - | Sakshi
Sakshi News home page

వేడుకలకు ముస్తాబైన సిర్సనగండ్ల

Published Tue, Apr 16 2024 1:20 AM | Last Updated on Tue, Apr 16 2024 1:20 AM

విద్యుత్‌ దీపాల వెలుగులో సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయం  - Sakshi

చారకొండ: మండలంలోని సిర్సనగండ్లలో వెలసిన సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా మొదటి రోజు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సీతారామచంద్రాస్వామి మాసకల్యాణం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అలాగే బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణోత్సవం, హనుమత్‌ వాహన సేవ, గురువారం చిన్న రఽథం(చిన్నతేరు), శుక్రవారం గరుడసేవ, శనివారం రాత్రి బ్రహ్మోత్సవం (పెద్ద రథం), ఆదివారం జగసేవ, దీపోత్సవం, సోమవారం చక్రతీర్థం, ఏకాంత సేవ, ద్వాదశ ఆరాధన తదితర కార్యక్రమాలు ఉంటాయని ఆలయ చైర్మన్‌ రామశర్మ, ఈఓ శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. స్వా మివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

200 మందితో బందోబస్తు

బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, 18 మంది ఎస్‌ఐలు, 27 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తారని సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు.

● బ్రహ్మోత్సవాలకు ఇతర ప్రాంతాలను తరలివచ్చే వేలాది మంది భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనుంది. ఇందుకోసం కల్వకుర్తి, దేవరకొండ, ఇబ్రహింపట్నం, షాద్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి.

ఎస్పీ పరిశీలన

సిర్సనగండ్లలో నిర్వహించే సీతారాముల కల్యాణానికి, బ్రహ్మోత్సవాలకు పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ తెలిపారు. సోమవారం ఆయన ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్‌ రామశర్మ, అర్చకులు ఎస్పీతోపాటు కల్వకుర్తి డీఎస్సీ వెంకటేశ్వర్లును శాలువాతో సన్మానించారు. అనంతరం ఆలయ పాలకవర్గం భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు, విద్యుత్‌, నీటి సౌకర్యం, భక్తులు కల్యాణ వేడుకలో సంబంధిత విషయాలను అడిగి తెలుసుకున్నారు.

నేటినుంచి సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు

ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం

No comments yet. Be the first to comment!
Add a comment
ఆలయంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ తదితరులు
1/1

ఆలయంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ తదితరులు

Advertisement
 
Advertisement
 
Advertisement