మహిళా సాధికారతకు కృషి
అచ్చంపేట రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. బుధవారం మండలంలోని చెన్నారం గ్రామంలో మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు రాయితీ గ్యాస్ సిలిండర్ల ప్రొసీడింగ్‌లు పంపిణీ చేసి మాట్లాడారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్‌ను అందిస్తున్నట్లు చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఆరు గ్యారంటీల
అమలు ప్రభుత్వ బాధ్యత..
అమ్రాబాద్: ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు ప్రజా ప్రభుత్వం బాధ్యతగా పని చేస్తోందని.. రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగిన సమావేశంలో రాయితీ గ్యాస్ సిలిండర్ల ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పంట రుణమాఫీ హామీలు అమలు చేసిందన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. సమావేశంలో ఎంపీడీఓ వెంకటయ్య, కాంగ్రెస్‌పార్టి మండల అధ్యక్షుడు హరినారాయణగౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment