సర్వేకు సమాయత్తం
●
శిక్షణ పరిశీలన..
జిల్లాలో సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులు కృషి చేస్తున్నారు. జిల్లా, మండల స్థాయిలో ఇప్పటికే శిక్షణ పూర్తిచేశారు. ఎన్యుమరేటర్లకు కూడా మున్సిపల్, మండల స్థాయిలో శిక్షణ ఇచ్చారు. మాస్టర్ ట్రైనర్లు ద్వారా శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సమావేశాలు చేపట్టారు. అలాగే క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టాల్సిన తీరును పరిశీలిస్తున్నారు. ప్రణాళిక, పంచాయతీ తదితర శాఖల అధికారులు సైతం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
రేపటి నుంచి సమగ్ర కుటుంబ సామాజిక, ఆర్థిక, కులగణన
● ఇంటింటికి తిరుగుతూ 56 అంశాలపై వివరాల సేకరణ
● సిబ్బందికి ప్రత్యేక శిక్షణ పూర్తి.. మెటీరియల్ అప్పగింత
● క్షేత్రస్థాయిలో పక్కాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
స్టిక్కర్లు అంటించాలి
ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియలో ఎన్యుమరేటర్లు సమగ్ర వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలి. ఇప్పటికే శిక్షణ ద్వారా అవగాహన కల్పించాం. సర్వేలో సేకరించిన సమాచారాన్ని రోజువారీగా ప్రభుత్వానికి నివేదిస్తాం. ఇంటింటికి స్టిక్కర్లు అంటించే కార్యక్రమం కొనసాగుతుంది. కుటుంబ సభ్యులు వెల్లడించిన వారి పేరును మాత్రమే ఇంటి యజమానిగా నమోదు చేస్తారు.
– బదావత్ సంతోష్, కలెక్టర్
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేకు జిల్లా అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే జిల్లాలో అధికారులు సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. క్షేత్రస్థాయిలో సర్వే పక్కాగా చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సంబంధిత మెటీరియల్‌ను అందించడంతోపాటు సర్వేకు ముందుగానే గ్రామాల్లో ఇళ్లు, కుటుంబాల లెక్కలు తీస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి సర్వే ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రకటించడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పర్యటన..
జిల్లాలోని అన్ని కుటుంబాలకు సంబంధించిన వివరాలను సేకరించేందుకు ఏర్పాట్లు చేశారు. కుల, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ సంబంధిత వివరాలను ఎన్యుమరేటర్ల ద్వారా సేకరించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ బదావత్ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య ప్రణాళిక శాఖాధికారి, ఇతర జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్యుమరేటర్లు, సిబ్బందిని నియమించి వారిని సర్వేకు సిద్ధం చేస్తున్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లకు అవగాహన కల్పించారు. 2011 జనగణనలో ఉపయోగించిన మ్యాపుల సాయం తీసుకుంటారు. ఎంపిక చేసిన ఎన్యుమరేటర్లకు ఇప్పటికే కొన్నిచోట్ల గ్రామాల వారీగా ఇళ్లు, కుంటుబాల లెక్కలు తీసి పెట్టుకున్నారు.
సూపర్‌వైజర్లు, నోడల్ అధికారులు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేలో అన్ని వివరాలు నమోదు కానున్నాయి. 150 ఇళ్లకు ఓ ఎన్యుమరేషన్ బ్లాక్‌గా ఏర్పాటు చేసి, ఆ బ్లాక్‌కు ఒక ఎన్యుమరేటర్‌ను నియమించారు. వారిపైన సూపర్‌వైజర్లు, నోడల్ అధికారులు ఉంటారు. సర్వేలో ఇంటి యజమాని నుంచి పూర్తి వివరాలు తీసుకోనున్నారు. ప్రభుత్వం పేర్కొన్న ఈ ఫార్మట్‌లో 56 అంశాలకు సంబంధించిన వివరాలు సేకరించాలి.
2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా 8,61,766
జిల్లాలో గ్రామ
పంచాయతీలు 464
మున్సిపాలిటీలు : 4
ఎన్యుమరేటర్లు : 1,979
వివరాలు
సేకరించాల్సిన అంశాలు
56
మొత్తం
గృహాలు 1,96,261
Comments
Please login to add a commentAdd a comment