ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాకేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు 56 మంది అభ్యర్థులు హాజరుకాగా.. సాయంత్రానికి పూర్తయిందని డీఈఓ గోవిందరాజులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్జీటీ తెలుగు మీడియంలో 50 మంది, ఉర్దూ మీడియంలో ఆరుగురు అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్నారని పేర్కొన్నారు. 5వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.. అర్హులైన అభ్యర్థుల సెల్ఫోన్లకు ఇప్పటికే సమాచారం అందించామని వివరించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగనుందని.. ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులు తీసుకురావాలని కోరారు. గురువారం నుంచి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు.
● తొలిరోజు 56 మంది అభ్యర్థులు హాజరు
Comments
Please login to add a commentAdd a comment