నాగర్‌కర్నూల్: జాతిపిత మహాత్మాగాంధీ మార్గం అనుసరణీయమని.. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గాంధీజయంతిని పురస్కరించుకొని బుధవారం జిల్లాకేంద్రంలోని మున్సిపల్ పార్క్ వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి కలెక్టర్, , ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో గాంధీ పాత్ర మరువలేనిదన్నారు. అహింసను ఆయుధంగా చేసుకొని ఎన్నో ఉద్యమాలు చేసి దేశ ప్రజలను స్వాతంత్య్రం కోసం ముందుకు నడిపిన మహనీయుడని కొనియాడారు. గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే డా. రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ.. నేడు మనం స్వాతంత్య్ర ఫలాలు అనుభవిస్తున్నామంటే మహాత్మాగాంధీలాంటి నిస్వార్థ నాయకులవల్లేనని, ఆయన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ కల్పన, పుర కమిషనర్ నరేష్‌బాబు, కౌన్సిలర్లు బాబురావు, సునీందర్, నిజాముద్దీన్, పద్మ, భూదానం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ బదావత్ సంతోష్
Comments
Please login to add a commentAdd a comment