ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్లు నిర్మించుకోవాలి
పథకాలపై అవగాహనకే
ప్రచార కార్యక్రమాలు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజలకు అవగాహన కల్పిస్తారని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ప్రజా పాలన కళాయాత్ర సమాచార, జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక కళాకారులతో వాహనాన్ని ప్రత్యేకంగా ఫ్లెక్సీ బ్యానర్లతో సిద్ధం చేయగా.. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ బృందం ప్రజాపాలన– ప్రజా విజయోత్సవాలపై అవగాహన కల్పిస్తారన్నారు. ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తిగా అవగాహన చేసుకుని సద్వినియోగం చేసుకునేందుకు ఇది ఒక మంచి సదవకాశం అని చెప్పారు. ప్రతిరోజు ప్రతి మండలం నుంచి ఎంపిక చేసిన మూడు గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్ దేవసహాయం, డీఆర్‌డీఓ చిన్న ఓబులేసు, డీపీఆర్‌ఓ కిరణ్‌కుమార్, డీఈఓ గోవిందరాజులు, డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈలు శ్రీధర్‌రావు, సుధాకర్‌సింగ్, డీడబ్ల్యూఓ రాజేశ్వరి, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, సాంస్కృతిక శాఖ కళాజాత బృందం సభ్యులు భాస్కర్, శివ, కృష్ణ, పార్వతమ్మ, శైలజ పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్: మరుగుదొడ్లు మన ఆత్మగౌరవం కోసమని, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం–2024 సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో మన ‘మరుగుదొడ్డి– మన ఆత్మగౌరవం’ అంశంపై నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంగళవారం నుంచి వచ్చే నెల 10 వరకు జిల్లాలోని అన్ని గ్రామాలను ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ (ఓడీఎఫ్) ప్లస్ మోడల్ గ్రామాలుగా మార్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నామన్నారు. గ్రామాల్లో మరుగుదొడ్లు లేని కుటుంబాలను గుర్తించి వాటి నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు సిటిజన్ రిజిస్ట్రేషన్ ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం 1,643 దరఖాస్తులు చేసుకున్నారని, 485 మరుగుదొడ్లు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశామన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఉత్తమ మరుగుదొడ్లను గుర్తించి ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీలు, పీహెచ్‌సీల్లో ఇది వరకే నిర్మించిన మరుగుదొడ్లు వినియోగంలో లేకుంటే వాటిని వెంటనే అందుబాటులోకి తేవాలని చెప్పారు. గ్రామాల్లో మరుగుదొడ్ల వినియోగంపై ముగ్గుల పోటీలు నిర్వహించి, అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం అవగాహన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment