నాగర్‌కర్నూల్
గురువారం శ్రీ 21 శ్రీ నవంబర్ శ్రీ 2024
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే నత్తనడకన సాగుతుంది. ఈ సర్వేపై ప్రభుత్వం ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడం వల్లే సర్వేకు వచ్చిన వారికి వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. సర్వే ఎందుకు చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తే వారు కనీసం సమాధానం కూడా ఇవ్వకపోతుండటంతో.. సర్వేకు ఎక్కువ శాతం ప్రజలు సహకరించడం లేదు. అయితే జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో ప్రజలు సర్వేకు కొంతమేర నిరాకరిస్తుండగా.. పల్లెల్లోనే పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా ఈ నెల 9న ప్రారంభమైన సర్వే జిల్లాలో ఇప్పటి వరకు 55 శాతం పూర్తయింది.
అసలు సర్వే ఎందుకు..
ప్రభుత్వం చేపట్టిన సర్వేపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో అనేక అపోహలు పెట్టుకుంటున్నారు. కులగణన, రేషన్ కార్డు కోసం ఇన్ని వివరాలు అవసరమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికి అధికారులు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
మరో 15 రోజులు పట్టొచ్చు..
ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే ఈ నెల 25 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే నిర్దేశించిన ప్రకారం సర్వే పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. వందశాతం పూర్తి కావడానికి ఇంకా 15 రోజులు పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక కుటుంబం పూర్తి వివరాలు తెలుసుకోవడానికి సిబ్బందికి అరగంట కంటే ఎక్కువ సమయం కావడంతో సర్వే వేగవంతం కాలేకపోతుంది. రోజుకు 8 నుంచి 12 కుటుంబాలను మాత్రమే సర్వే చేస్తున్నారు. అలాగే కొందరు ఉద్యోగులు సెలవు దినాల్లో పనిచేయడానికి ఇష్టపడటం లేదు. అంగన్‌వాడీలు సైతం పూర్తిస్థాయిలో సర్వేలో పాల్గొనడం లేదని తెలుస్తోంది. సర్వే చేసేందుకు ఏ మేరకు గౌరవ వేతనం ఇస్తారో కూడా స్పష్టంగా చెప్పకపోవడంతో ఎన్యుమరేటర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇన్ని సమస్యలు మద్య సకాలంలో సర్వే, డాటా ఎంట్రీ పూర్తవుతుంది అనేది అంతులేని ప్రశ్నగా మారుతోంది.
న్యూస్‌రీల్
అప్పులు చెబుతున్నా..ఆస్తుల వెల్లడికి నిరాకరణ
వివరాలు చెప్పేందుకు అధిక శాతం మొగ్గుచూపని ప్రజలు
కొన్నిచోట్లఎన్యుమరేటర్లను నిలదీస్తున్న వైనం
జిల్లాలో నత్తనడకన సాగుతున్నకుటుంబ సమగ్ర సర్వే
Comments
Please login to add a commentAdd a comment