నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్, పదర, లింగాల, అచ్చంపేట, కొల్లాపూర్ మండలాల్లో చెంచులు, గిరిజన చిన్నారులను యథేచ్ఛగా పనుల్లో పెట్టుకుంటున్నారు. దీంతో బాల్యం నుంచే చిన్నారులు బడికి దూరంగా ఉంటూ, బండెడు చాకిరీలో మగ్గుతున్నారు. ఆపరేషన్ ముస్కాన్ పేరుతో పోలీస్, రెవెన్యూ, కార్మికశాఖ, బాలల సంరక్షణ శాఖ అధికారులు బాలకార్మికులను గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. జిల్లాలో ఈ కార్యక్రమం నామమాత్రంగా కొనసాగుతోంది. చాలా వరకు ఫిర్యాదులు, సమాచారం అందితే గాని అధికారులు స్పందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పరిశ్రమలు, ఇటుక బట్టీలు, రైస్‌మిల్లులు, హోటళ్లతో పాటు పశువుల కాపరులుగా బాలలు పనిచేస్తున్నారు. వీటిపై దృష్టిపెట్టి పర్యవేక్షించాల్సిన కార్మికశాఖ అధికారుల నుంచి పట్టింపు కరువైంది. ఫలితంగా బాలకార్మికులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న యజమానుల ఆగడాలు సాగుతున్నాయి. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో దృష్టిసారించి, పనుల్లో మగ్గుతున్న బాలలకు విముక్తి కల్పించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment