ప్రాథమిక దశలోనే కంటి సమస్యల గుర్తింపు
నాగర్‌కర్నూల్ క్రైం: విద్యార్థుల్లో కంటి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డా.స్వరాజ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో కంటి సమస్యలను గుర్తించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 305 విద్యాలయాల్లో 30,264 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి.. 1,100 మందికి దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు వివరించారు. మరో 140 మంది విద్యార్థులకు ఇతర కంటి సమస్యలు గుర్తించినట్లు తెలిపారు. విద్యార్థులు రోజు ఆకుకూరలు, కూరగాయలు, సీజనల్ పండ్లు తినాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం అధికారి డా.రవికుమార్, డా.మహతి, డీపీఓ రేణయ్య, ఆప్తాలమిక్ డాక్టర్ బాలాజీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment