కురుమూర్తి హుండీ ఆదాయం రూ. 22,78,896
చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి ఆలయంలో హుండీలను శుక్రవారం దేవాదాయశాఖ అధికారులు లెక్కించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు, జాతరను పురస్కరించుకొని భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా.. రూ. 22,78,896 ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈఓ మధనేశ్వర్‌రెడ్డి తెలిపారు. కాగా, కురుమూర్తి జాతరకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకొని పునీతులయ్యారు. అలువేలు మంగమ్మ, ఆంజనేయస్వామి, చెన్నకేశవస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో జాతర మైదానం కిక్కిరిసి కనిపించింది. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భాస్కరాచారి, భారతమ్మ, కమలాకర్, శ్రీధర్‌రెడ్డి, శేఖర్, గోపాల్, చక్రవర్ధన్‌రెడ్డి, బాదం వెంకటేశ్వర్లు, అర్చకుడు వెంకటయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment