ధాన్యం కొనుగోలు ప్రక్రియ పక్కాగా చేపట్టాలి
బిజినేపల్లి: ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ సీతారామారావు అన్నారు. మండలంలోని వట్టెంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. కేంద్రాల వద్ద ఐకేపీ సీసీలు పొరపాట్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం సేకరణలో పొరపాట్ల కారణంగానే వట్టెం కొనుగోలు కేంద్రంలో సీసీ లక్ష్మణ్‌ను సస్పెండ్ చేశామని.. అతడి స్థానంలో మరో సీసీని ఏర్పాటు చేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాలను ఐకేపీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. గన్నీబ్యాగుల పంపిణీలో జాగ్రత్తలు పాటించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ వెంట డీఆర్డీఓ ఓబులేషు, డీఎస్‌ఓ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీరాములు, ఏఓ నీతి, ఏపీఎం రజిత, ఆర్‌ఐ అలీబాబా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment