చలి నుంచి రక్షించుకునేందుకు చెంచులు బొడ్డు గుడిసెల్లో నెగడి ఏర్పాటు చేసుకుంటున్నారు. నెగడి మీదనే వారు వంటావార్పు చేసుకుంటున్నారు. ఎలాంటి వెలుతురు లేని చెంచుల గుడిసెల్లో నెగడి మంట వెలుతురు ఇవ్వడంతో పాటు అటవీ జంతువుల నుంచి రక్షణగా నిలుస్తోంది. ముఖ్యంగా నల్లమలలోని కోర్ ఏరియాలో జీవిస్తున్న చెంచుల బతుకులు మరింత దుర్భరంగా తయారయ్యాయి. అప్పాపూర్, పుల్లాయిపల్లి, రాంపూర్, భౌరాపూర్, సంగడి గుండాలు, బక్కచింతపెంట, ఫర్హాబాద్, మేడిమొల్కల, తాటిగుండాలు, ఇర్లపెంట, ఆగర్లపెంట, ధారవాగు, తాటిగుండాలు, పెద్దూటి, బట్టిచింతల, ఎంకలపెంట, కొమ్మనపెంట, కండ్లకుంట, పల్లెరూట్‌పెంట, ఈదులబావి, మొల్కమామిడి చెంచుపెంటలు చలికి వణికిపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment