అచ్చంపేట: చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వారం రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోవడంతో నల్లమల గజగజ వణుకుతోంది. చలికి తోడు ఈదురుగాలులు కూడా ఎక్కువయ్యాయి. ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవడంతో ఉదయం 9 గంటలైనా ఇక్కడ పొద్దు (వెలుతురు) కనిపించడం లేదు. మంచు కమ్ముకుంటుండటంతో బయటికి రాలేని పరిస్థి తి నెలకొంది. బొడ్డు గుడిసెలు, గుడారాలు మంచుకు తడిసి ముద్దవుతున్నాయి. చలి నుంచి రక్షణ కోసం చెంచులు సాయంత్రం అయిందంటే చలి మంటలు (నెగడి) వేస్తున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని దట్టమైన అటవీ అభయారణ్యంలో గతేడాది నవంబర్ 23వ తేదీన 25 డిగ్రీల కనిష్ట ఉష్టోగ్రత నమోదు కాగా.. ఈ ఏడాది ఇప్పటికే 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే 9 డిగ్రీల మైనస్ ఉష్ణోగ్రత నమోదు కావడం చలి తీవ్రతకు అద్దం పడుతుంది. సాయంత్రం 5 నుంచి ప్రారంభమవుతున్న చలి.. ఉదయం 10 గంటల వరకు వదలడం లేదు. దీంతో వయోవృద్ధులు, పిల్లలు, మహిళలు, దీర్ఘకాలిక వాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చలి నుంచి రక్షించుకునేందుకు అవసరమైన దుప్పట్లు కూడా లేక వణికి పోతున్నారు. ఐటీడీఏ పంపిణీ చేసినట్లుగా చెబుతున్న దుప్పట్లు చాలీచాలకుండా ఉండటంతో చలి నుంచి రక్షణ లేకుండా పోయిందని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రివేళల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
చలికి తోడు ఈదురుగాలులు
వణుకుతున్న చెంచు పెంటలు
Comments
Please login to add a commentAdd a comment