తరుగు పేరుతో మోసం
పెంట్లవెల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని సీపీఎం జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వర్ ఆరోపించారు. శనివారం సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే.. తరుగు పేరుతో 40 కిలోల బస్తాకు 300 గ్రాములు అదనంగా కాంటా చేసి, నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. మరోవైపు మ్యాచర్ రాలేదని, హమాలీలు లేరని సాకులు చెబుతూ.. వడ్లను కాంటా చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అన్ని రకాల వడ్లకు రూ. 500 బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హన్మంతు, శ్రీనివాస్, సురేష్, రాములు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment