ఆలయాల్లో భక్తుల సందడి
ఉమామహేశ్వరుడి దర్శనానికి
బారులుదీరిన భక్తులు
నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలు భక్తులతో సందడిగా కనిపించాయి. వేకువజామునే మహిళలు ఇంటి ముంగిట కలాపి చల్లి వివిధ ఆకృతుల్లో రంగవల్లులను తీర్చిదిద్దారు. అనంతరం కుటుంబ సమేతంగా ప్రసిద్ధ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి గంటల తరబడి క్యూకట్టారు. బిజినేపల్లి మండలంలోని వట్టెం వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడిపారు. భక్తులు పెద్దఎత్తున ఆలయాన్ని సందర్శించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. మరికొందరు న్యూ ఇయర్ కేక్‌లు కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుసుకున్నారు.
– సాక్షి నెట్‌వర్క్
Comments
Please login to add a commentAdd a comment