‘రైతుభరోసా రూ.15 వేలు ఇవ్వాలి’
నాగర్‌కర్నూల్ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతుభరోసా ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాల్సిందేనని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గం పర్వతాలు డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వానాకాలం సీజన్ ముగిసినా ఇప్పటి వరకు రైతుభరోసా ఇవ్వలేదని, ప్రస్తుత యాసంగిలోనూ ఎకరాకు రూ.12 వేలు ఇస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల ముందు మహేశ్వరం నియోజకవర్గం తక్కుగూడ వేదిక మీద రాహుల్‌గాంధీ సమక్షంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు శ్రీనివాసులు, దేశ్యానాయక్, ఆంజనేయులు, శ్రీనివాసులు, ఈశ్వర్, పొదిల రామయ్య, అశోక్, మల్లేశం, శంకర్‌నాయక్, ఈశ్వర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment