ప్రతిఒక్కరు కంటి పరీక్షలు చేసుకోవాలి
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రతిఒక్కరూ కళ్లు, కంటిచూపు, ఇతర ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ జీవితకాలంపాటు కంటి దృష్టి కలిగి ఉండాలని ఆప్తాలమిక్ ఆఫీసర్ బాలాజీ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 65 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి కంటిపొర ఉన్న 21 మందిని గుర్తించి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయడానికి ప్రత్యేక అంబులెన్స్‌లో ఏనుగొండ లయన్ రాంరెడ్డి కంటి ఆస్పత్రికి తరలించామన్నారు. కంటి సమస్యలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీనివాసులు, డిప్యూటీ పారామెడికల్ అధికారి సుకుమార్‌రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment