మార్కండేయ లిఫ్టు ట్రయల్‌ రన్‌ విజయవంతం | - | Sakshi
Sakshi News home page

మార్కండేయ లిఫ్టు ట్రయల్‌ రన్‌ విజయవంతం

Published Wed, Jan 8 2025 12:53 AM | Last Updated on Wed, Jan 8 2025 12:54 AM

మార్క

మార్కండేయ లిఫ్టు ట్రయల్‌ రన్‌ విజయవంతం

బిజినేపల్లి: జిల్లాలోని రెండు మండలాలు, 8 గ్రామాలు, 12 గిరిజన తండాల పరిధిలో పొలాలకు సాగునీరందించే ఉద్దేశంతో చేపట్టిన మార్కండేయ ఎత్తిపోతల పథకం మోటార్‌ ట్రయల్‌ రన్‌ను మంగళవారం రాత్రి అధికారులు విజవయంతంగా నిర్వహించారు. ఎస్‌ఈ సత్యనారాయణరెడ్డి పర్యవేక్షణలో మోటార్‌ను ప్రారంభించి నీటిని ఎత్తిపోశారు. ఈ ప్రాజెక్టును రూ.86 కోట్ల వ్యయంతో నిర్మించారు. కాగా.. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అధికారులు మొదటిసారి ఈ లిఫ్టు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. కొద్దిరోజుల కిందటే మార్కండేయ లిఫ్టును ప్రారంభిస్తామని ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి హామీ ఇచ్చారని, ఈ మేరకు పనులు పూర్తి చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చారు. ట్రయల్‌రన్‌ను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, స్థానిక రైతులు తిలకించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మార్కండేయ లిఫ్టు ట్రయల్‌ రన్‌ విజయవంతం 1
1/1

మార్కండేయ లిఫ్టు ట్రయల్‌ రన్‌ విజయవంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement