ఎన్నికల కమిషన్ తాజాగా విడుదల చేసిన ఎస్‌ఎస్‌ఆర్– 2025 ఓటర్ల తుది జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాలు మినహా మిగతా అన్నిచోట్ల పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటం విశేషం.
● ఎస్‌ఎస్‌ఆర్– 2025లో ఓటరు నమోదుకు జనవరి 1 అర్హతగా తీసుకొని కొత్త దరఖాస్తులను స్వీకరించింది. గతేడాది మే నెలలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే ఎస్‌ఎస్‌ఆర్– 2025 తుది జాబితాలో 39,164 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. తాజాగా విడుదల చేసిన స్పెషల్ సమ్మరీ రివిజన్–2025 ఓటర్ల తుది జాబితా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ఆయా రాజకీయ పార్టీలను అప్రమత్తం చేసినట్లయ్యింది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రానున్న దృష్ట్యా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఎస్‌ఎస్‌ఆర్– 2025 ఓటర్ల తుది జాబితా ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment