స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
నాగర్‌కర్నూల్/ నాగర్‌కర్నూల్ రూరల్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ మార్కెట్ యార్డు నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రైతు భరోసాను ప్రభుత్వం ఎకరాకు రూ.12 వేలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. అనంతరం మార్కెట్ పాలకమండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గ ప్రజలు అండగా ఉండాలని కోరారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ నూతన పాలకమండలి మార్కెట్ యార్డుకు రైతులు తీసుకువచ్చే సరుకులకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలన్నారు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ నూతన పాలకమండలిపై గురుతల బాధ్యత ఉందని, రైతులకు అందుబాటులో ఉండి న్యాయం చేకూర్చాలని చెప్పారు. అనంతరం అధ్యక్షుడు రమణారావు, ఉపాధ్యక్షుడు జంగయ్య, కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో వేపూరి సోమన్న ఆటపాట ఆకట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment