హమాలీల రేట్ల ఒప్పందాన్ని అమలుపర్చాలి
నాగర్‌కర్నూల్‌రూరల్: సివిల్ సప్లై హమాలీల రేట్ల ఒప్పందాన్ని అధికారులు అమలుపర్చాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలయ్య డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎగుమతి, దిగుమతి రేట్ల ఒప్పందం ప్రకారం హమాలీలకు చెల్లింపులు చేయాలని కోరుతూ ఇప్పటికే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వినతిపత్రం అందించినట్లు చెప్పారు. అక్టోబర్‌లో ఆ ఒప్పందాన్ని అమలు చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. పౌరసరఫరాల సంస్థ వేతన ఒప్పందాన్ని వెంటనే అమలుపర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు వర్ధం పర్వతాలు, హమాలీ సంఘం నాయకులు గోపాల్, రవి, చంద్రయ్య, వెంకటయ్య, సుందరయ్య, కృష్ణయ్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment